
కార్మికులకు ఏఐటీయూసీ అండ
సింగరేణి కార్మికులకు అండగా నిలిచి హక్కులు సాధిస్తున్నది ఏఐటీయూసీ మాత్రమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు వై.గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామ య్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య అన్నారు.
- సీతారామయ్య, గట్టయ్య, రంగయ్య
- భూపాలపల్లి ఏరియూలో ‘పోరు యూత్ర’
కరీంనగర్/ కోల్‌బెల్ట్(వరంగల్) : సింగరేణి కార్మికులకు అండగా నిలిచి హక్కులు సాధిస్తున్నది ఏఐటీయూసీ మాత్రమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు వై.గట్టయ్య, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామ య్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య అన్నారు. యూనియన్ చేపట్టిన ‘పోరు యాత్ర’ శుక్రవా రం భూపాలపల్లిలోని గనులు, డిపార్ట్‌మెంట్‌ల వద్ద కొనసాగింది. అనంతరం బ్రాంచ్ కార్యాలయంలో విలేకరులతో నాయకులు మాట్లాడారు. సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా గెలిచిన నాటి నుంచి నాలుగేళ్లలో కార్మికులు అదనపు పనిభారం, మానసిక ఒత్తిడి ఎదుర్కోవడమే కాకుండా సాధించుకున్న హక్కులను పోగొట్టుకున్నారని అన్నారు.
కార్మికులకు సకల జనుల సమ్మె కాలపు వేతనాలు చెల్లించడానికి నిధులు లేవని ప్రకటిస్తున్న యాజమాన్యం సీఎస్‌ఆర్ నిధులను సీఎం బంధువులు, ప్రజాప్రతినిధులకు కేటాయించిం దని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంత రం మిగులు బడ్జేట్‌లో సింగరేణికి రూ.2000 కోట్లు కేటాయించి నూతన గనులు ఏర్పాటు చేయూల్సి ఉండ గా కంపెనీలో విచ్చలవిడి దుబారా కారణంగా సింగరే ణి తిరిగి బీఐఎఫ్‌ఆర్ పరిధిలోకి వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. పోరు యూత్రలో భాగంగా ఈనెల 18న కొత్తగూడెంలో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కొరిమి రాజ్‌కుమార్, మొటపలుకుల రమేష్, కొరిమి సుగుణ, ఏడుకొండలు, రాంచందర్, అంజయ్య, శ్రీనివాస్, గీట్ల రాజిరెడ్డి, జిల్లా తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
పోరు యాత్రకు ఘన స్వాగతం
ఉదయం భూపాలపల్లి ఏరియాకు చేరిన ‘పోరు యూత్ర’కు సీపీఐ, ఏఐటీయూసీ, మహిళా, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు గనుల వద్ద ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో ఆహ్వానించారు. కేటీకే 1, 2, 5, 6, ఓసీపీ, కేఎల్‌పీ, మంజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రి, ఏరియా స్టోర్స్, వర్క్‌షాప్, సుభాష్‌కాలనీ, ఎండీ క్వార్టర్స్, కృష్ణాకాలనీ వద్ద నాయకులు మాట్లాడారు.