'డబ్బు కోసమే హీరోయిన్‌ ఆరోపణలు' | Actress Sexual harassment case: Accused get Bail | Sakshi
Sakshi News home page

'డబ్బు కోసమే హీరోయిన్‌ ఆరోపణలు'

Sep 1 2017 3:14 PM | Updated on Jul 23 2018 9:15 PM

బాధితురాలు - Sakshi

బాధితురాలు

కారులో నటిపై తాము ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని నిందితులు తెలిపారు.

సాక్షి, విజయవాడ: వర్ధమాన సినీ హీరోయిన్‌పై అత్యాచారయత్నం కేసులో అరెస్టైన నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శుక్రవారం వీరు జైలు నుంచి విడుదలయ్యారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు కారులో వెళుతుండగా వర్ధమాన హీరో కొండూరు స్టీఫెన్‌ ఆలియాస్‌ సృజన్, దర్శకుడు చలపతి తనపై అత్యాచారయత్నం చేశారని బాధితురాలు గత నెలలో పడమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. వీరికి విధించిన రిమాండ్‌ నేటితో ముగిసింది.

కాగా,  బాధితురాలు ఆరోపణలను నిందితులు తోసిపుచ్చారు. కారులో ఆమెపై తాము ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని, కావాలనే తమపై ఆరోపణలు చేసిందని నిందితులు అన్నారు. కారు ప్రమాదానికి గురికావడంతో ఆమె ఆందోళన చెందిందని, దుర్ఘటన తర్వాత తమతో పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుందని తెలిపారు. డబ్బు కోసమే తమపై ఆమె తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement