విలన్‌గానూ మెప్పించాలని ఉంది
హీరోగా, కామెడీ హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్నపాత్రలు చేసిన తనకు విలన్ పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాలని ఉందని సీనియర్ నటుడు ‘నవరసరాయ’ డాక్టర్ నరేష్ తెలిపారు. గోకవరం మండలం తంటికొండ గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం జరిగిన ‘శతమానంభవతి’ సినిమా షూటింగ్ సందర్భంగా నరేష్ స్థానిక విలేకరులతో ముచ్చటించారు.
-
సీనియర్ నటుడు ‘నవరసరాయ’ డాక్టర్ నరేష్
గోకవరం :
హీరోగా, కామెడీ హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్నపాత్రలు చేసిన తనకు విలన్ పాత్రలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాలని ఉందని సీనియర్ నటుడు ‘నవరసరాయ’ డాక్టర్ నరేష్ తెలిపారు. గోకవరం మండలం తంటికొండ గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం జరిగిన ‘శతమానంభవతి’ సినిమా షూటింగ్ సందర్భంగా నరేష్ స్థానిక విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఇప్పటి వరకు హీరోగా 70 సినిమాలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సుమారు 150 వరకు సినిమాల్లో నటించాను. తన ఏడో యేటే పండంటి కాపురం సినిమాలో బాలనటుడిగా సినిమాల్లో అరంగేట్రం చేశా. సినీ పరిశ్రమకు వచ్చిన దాదాపు 43 సంవత్సరాల్లో హీరో పాత్రలు, సీరియస్, కామెడీ, సెంటిమెంట్ పాత్రలు పండించే అవకాశం దక్కింది. తన సినీ జీవితంలో ‘జంబలకిడిపంబ’ సినిమా మైలురాయిగా నిలిచిపోయిందన్నారు. ఇటీవ ల విడుదలైన భలేభలే మగాడివోయ్, అఆ, గుంటూరు టాకీస్ సిని మాలు తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాయి. ప్రస్తుతం శతమానంభవతి సినిమాలో హీరో శర్వానంద్‌కు తండ్రి పాత్రలో నటిస్తున్నా. అలాగే సునీల్ హీరోగా నటిస్తున్న ఈడు గోల్డ్‌ఎహే, రామ్ హీరోగా నటిస్తున్న హైపర్, రాజుగారి అబ్బాయి రాణి గారి అమ్మాయి సినిమాల్లో నటిస్తున్నా. యువ దర్శకులు వెరైటీ పాత్రలతో తనను సంప్రదిస్తున్నారు. రెండేళ్లుగా సినీ పరిశ్రమ కళకళలాడుతోంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి.
వాళ్లే స్ఫూర్తి.. : నటనలో తనకు ఎస్‌వి రంగారావు, సూపర్ స్టార్ కృష్ణ, పద్మభూషన్ కమల్‌హాసన్‌లే స్ఫూర్తి. ప్రస్తుతం రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ అత్యుత్తమ లొకేషన్లు ఉన్నాయి. నటులకు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లులాంటివి. తన నటనకు గాను ఇటీవల ఓ సంస్థ నవరసరాయ బిరుదుతో సత్కరించింది. అలాగే డాక్టరేట్‌తో గౌరవించారు. సినిమాల్లో రాణించాలంటే టాలెంట్‌తో పాటు క్రమశిక్షణ ఎంతో ముఖ్యం.