
108 నిమిషాల్లో 108 వినాయకులు..
108 మంది విద్యార్థులు 108 నిమిషాల్లో 108 రకాల గణనాధ చిత్రాలను గీసి అబ్బురపరిచారు.
హైదరాబాద్: 108 మంది విద్యార్థులు 108 నిమిషాల్లో 108 రకాల గణనాధ చిత్రాలను గీసి అబ్బురపరిచారు. ఈ అరుదైన చిత్ర మాలికల సమాహారానికి నగరంలోని వీఎన్‌ఆర్ సద్గురు పాఠశాల వేదికైంది. పాఠశాలకు చెందిన 108 మంది విద్యార్థులు వివిధ రూపాలలో పార్వతీ తనయుడి చిత్రాలను గీసి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నారు.