మధు మాదల కుటుంబానికి అండగా నాట్స్ | NATS Donates 25k dollars to Madhu madala's Family | Sakshi
Sakshi News home page

మధు మాదల కుటుంబానికి అండగా నాట్స్

Jun 14 2017 4:15 PM | Updated on Sep 5 2017 1:37 PM

మధు మాదల కుటుంబానికి అండగా నాట్స్

మధు మాదల కుటుంబానికి అండగా నాట్స్

అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరోసారి తన దాతృత్వం చాటింది.

25 వేల డాలర్ల చెక్కు అందజేత
న్యూ జెర్సీ:
అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరోసారి తన దాతృత్వం చాటింది. న్యూజెర్సీలో నివసిస్తున్న మధు మాదాల ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించారు. దీంతో మధు కుటుంబానికి అండగా నిలబడాలనే సంకల్పతో నాట్స్  మధు మాదల కుటుంబాన్ని ఆదుకోవాలని పిలుపునిచ్చింది.

వెంటనే నాట్స్ సభ్యులు.. ఇతర దాతలు స్పందించి విరాళాలు అందించారు. ఇలా సేకరించిన 25 వేల డాలర్ల చెక్కును నాట్స్  అధ్యక్షుడు మోహన కృష్ణమన్నవతో పాటు బోర్డు అఫ్ డైరెక్టర్స్ గంగాధర్ దేసు, రాజేంద్ర అప్పలనేని, నాట్స్ సెక్రటరీ రమేష్ నూతలపాటి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, న్యూ జెర్సీ కోఆర్డినేటర్ వంశీకృష్ణ  వెనిగళ్ల , చంద్ర శేఖర్ కొణిదెల  ఇతర నాట్స్ ప్రతినిధులు.. మధు మాదల కుటుంబానికి అందించారు. ఆపద కాలంలో నాట్స్ చేసిన సాయానికి మధు మాదల కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement