వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతిపై ఫిర్యాదు

YS Vivekananda Reddy PA Complaint To Police  - Sakshi

తలపై గాయం ఉండటంతో వివేకా మృతిపై అనుమానం

సాక్షి, పులివెందుల : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హఠాన్మరణంపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలపై గాయం ఉండటం.. చనిపోయిన సమయంలో వివేకానంద రెడ్డి ఒంటరిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివేకానందరెడ్డి భౌతికకాయానికి పోస్ట్‌ మార్టం నిర్వహించనున్నారు. గురువారం ప్రచారం ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసిన తర్వాత ఒక్కరే ఇంట్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బాత్‌రూంలో రక్తపు మడుగులో పడిఉండటాన్ని పనివారు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన అకాల మరణంపై అనుమానం వ్యక్తం అవుతోంది. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడైన వైఎస్‌ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో పులివెందుల్లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అకాల మరణంతో కడప జిల్లాతో పాటు, వైఎస్సార్‌ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది. (నిన్న కూడా ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ వివేకా)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top