ప్రాణం తీసిన ‘ఫుల్‌బాటిల్’

అతిగా మద్యం సేవించి యువకుడి మృతి
సాక్షి, నిర్మల్: క్షణికావేశంలో మద్యం మత్తులో తీసుకున్న నిర్ణయం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మణచాంద మండలంలోని చింతల్‌చాంద గ్రామానికి చెందిన షేక్ రసూల్(31) మామడ మండలం అనంతపేట్ గ్రామంలో మేస్రీ్తగా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఇళ్ల నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఐదుగురు మేస్త్రీలు కలిసి సోమవారం మద్యం సేవించారు. ఫుల్‌బాటిల్ మద్యాన్ని 15నివిుషాలలో తాగితే రూ.25వేలు ఇస్తామని ఇద్దరు మేస్త్రీలు రసూల్‌తో పందెం కాశారు.
దీంతో ఫుల్‌బాటిల్ మద్యాన్ని కూల్‌డ్రింక్స్‌లో కలుపుకుని రసూల్ సేవించాడు. బాటిల్‌లో సగం వరకు తాగి కింద పడిపోయాడు. అపస్మారకస్థితికి వెళ్లడంతో అంబులెన్స్‌కు సమాచారం అందించారు. చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రసూల్‌తో కలిసి మద్యం తాగినవారు పరారీలో ఉన్నారు. ఈ సంఘటనలో షేక్ నజూరుబాషా, రత్తయ్యలపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రసూల్‌కు భార్యతో పాటు కుమారుడు ఉన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి