ఐదుగురు పిల్లల్ని గంగానదిలోకి విసిరేసిన తల్లి | Woman Throws Five Children Into Ganges After Fight WIth Husband In UP | Sakshi
Sakshi News home page

దారుణం.. ఐదుగురు పిల్లల్ని గంగానదిలోకి విసిరేసిన తల్లి

Apr 13 2020 10:51 AM | Updated on Apr 13 2020 10:51 AM

Woman Throws Five Children Into Ganges After Fight WIth Husband In UP - Sakshi

పిల్లలను గంగలో తోసేసిన తర్వాత కూడా ఆమె అక్కడ నుంచి వెళ్లలేదు

 భోపాల్‌ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్తతో గొడవపడి ఓ మహిళ తన ఐదుగురు పిల్లల్ని నదిలో తోసేసింది. ఈ ఘటన భాదోహి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భాదోహి జిల్లా జహంగీరాబాద్‌ గ్రామానికి చెందిన మంజు యాదవ్, మృదుల్ యాదవ్‌లు భార్యాభర్తలు. గత ఏడాదిగా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో విసిగిపోయిన మంజు యాదవ్ పిల్లల్ని నదిలోకి విసిరి చంపేయాలని నిర్ణయించుకుంది.

శనివారం భార్యాభర్తల మధ్య మరోమారు ఘర్షణ జరిగింది. దీంతో మంజు తన పిల్లలను గంగానది ఒడ్డుకు తీసుకెళ్లి నదిలోకి విసిరేసింది.  వారిలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా, మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికి తీశారు. నదిలో గల్లంతైన మరో ముగ్గురి  కోసం వెతుకుతున్నారని జిల్లా ఎస్పీ రాం బదన్‌ సింగ్‌ తెలిపారు. ఏడాది కాలంగా భార్యాభర్తలు ఘర్షణ పడుతున్నారని  చెప్పారు. పిల్లలను గంగలో తోసేసిన తర్వాత కూడా ఆమె అక్కడ నుంచి వెళ్లలేదని స్థానికులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement