కేసు వెనక్కి తీసుకోలేదని.. కొట్టి చంపారు | Woman In Kanpur Beaten To Death By Minor Daughters Alleged Molesters | Sakshi
Sakshi News home page

కేసు వెనక్కి తీసుకోలేదని.. కొట్టి చంపారు

Jan 18 2020 6:32 PM | Updated on Jan 19 2020 8:21 AM

Woman In Kanpur Beaten To Death By Minor Daughters Alleged Molesters - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. లైంగిక వేదింపుల కేసును వెనక్కి తీసుకోనందుకు మైనర్‌ బాలిక తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ దాడిలో బాధితురాలికి కూడా తీవ్ర గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 2018లో జరిగిన లైంగిక దాడి నిందితులు చేసిన దాష్టీకమే ఇది.

చదవండి: దారుణం: మంచానికి కట్టేసి తగలబెట్టారు!

కాన్పూర్‌కి చెందిన మైనర్ బాలికపై అబిద్, మింటు, మహబూబ్, చాంద్ బాబు, జమీల్, ఫిరోజ్ అనే ఆరుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు. కాగా.. ప్రస్తుతం నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్‌పై బయటికొచ్చిన ఆ యువకులు బాధితురాలి ఇంటికి వెళ్లి కేసును విత్‌ డ్రా చేసుకోవాల్సిందిగా బెదిరించారు.

చదవండి: వీడియో తీసుకుని... ఉరి వేసుకుని... 

ఇందుకు కుటుంబసభ్యులు నిరాకరించడంతో బాధితురాలి తల్లిని తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయింది. కిందపడిపోయిన ఆమె తలపై కాలితో తన్నుతూ.. విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో మహిళతోపాటు కూతురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం బాధితురాలి తల్లి ఆస్పత్రిలో చనిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement