కుప్పకూలిన భవనం: నలుగురి మృతి | Three Storey Building Collapses In Kheda | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన భవనం: నలుగురి మృతి

Aug 10 2019 8:33 AM | Updated on Aug 10 2019 8:36 AM

Three Storey Building Collapses In Kheda - Sakshi

గాంధీనగర్‌: భారీ వర్షాలతో ఓ భవనంలో విషాదం చోటుచేసుకుంది. మూడంతస్తుల బల్డింగ్‌ కుప్పకూలడంతో నలుగురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్‌లోని ఖేడా జిల్లా ప్రగతి నగర్‌లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు శిథిలాలను తొలగించి.. సహాయ చర్యలను చేపట్టారు. గతవారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవనం ఒక్కసారిగా కూలిపోయిందని అధికారులు బెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడ్డ పలువురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గుజరాత్‌ వ్యాప్తంగా భారీ వర్షాలకు కురుస్తున్న విషయం తెలిసిందే. నర్మదా నది పరీవాహక ప్రాంతంలో వరద ఉధృతంగా పెరగడంతో సర్థార్‌ సరోవర్‌ డ్యాం గేట్లను ఎత్తి.. నీటిని దిగువకు వదులుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement