ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి | Three Members In Family Died With Thunderbolt In Vikarabad | Sakshi
Sakshi News home page

పిడుగుపాటు; తీవ్ర విషాదం

May 20 2019 6:56 PM | Updated on May 20 2019 7:29 PM

Three Members In Family Died With Thunderbolt In Vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్‌ : జిల్లాలోని దారూర్‌ మండలం రాజాపూర్‌ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడటం పలువురిని కలచి వేసింది. వివరాలు.. రాజాపూర్‌ గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్‌ కుటుంబం పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. అక్కడ పనిచేస్తుండగా పిడుగు పడటంతో భార్య ఖాజాబి(38), కూతురు తబస్సుమ్‌(16), కుమారుడు అక్రం(12) అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఫక్రుద్దీన్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా పిడుగుపాటుతో ఫక్రుద్దీన్‌ కుటుంబం మృత్యువాత పడటంతో రాజపూర్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement