టీడీపీ నేత కీచకపర్వం | TDP Leader Molestation On Girl in TDP Office Visakhapatnam | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత కీచకపర్వం

Dec 28 2018 8:37 AM | Updated on Dec 28 2018 8:51 AM

TDP Leader Molestation On Girl in TDP Office Visakhapatnam - Sakshi

కార్యాలయంలో మహనీయుల ఫొటోల సాక్షిగా రాసలీలల దృశ్యం. (ఇన్‌సెట్‌లో) నెల్లి సాధూరావు

సోషల్‌ మీడియాలో వీడియో హల్‌చల్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు, మహా విశాఖ నగర టీడీపీ బీసీ సెల్‌ కార్యదర్శి నెల్లి సాధూరావు అభం శుభం తెలియని ఓ బాలికతో రాసలీలలు జరిపిన వీడియో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. గాజువాక కైలాస్‌నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో మహనీయులు పూలే, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఫొటోల సాక్షిగా మనమరాలి వయసున్న బాలికతో అశ్లీలంగా ప్రవర్తించిన దృశ్యాల వీడియో కలకలం రేపుతోంది. డాక్‌యార్డ్‌లో పనిచేసి రెండేళ్ల కిందటే రిటైర్‌ అయిన సాధూరావు.. ముప్‌పై ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నాడు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ స్థానిక అధికార ప్రతినిధిగా, జన్మభూమి కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఆయన.. వివిధ ప్రభుత్వ పథకాల పేరుతో అమాయక యువతులపై వల వేయడం, పార్టీ కార్యాలయానికి రప్పించి ప్రలోభపెట్టడం, శారీరకంగా లోబర్చుకోవడం కొన్నేళ్ల నుంచి రివాజుగా మారిందన్న ఆరోపణలున్నాయి. కార్యాలయంలో బెడ్‌ ఏర్పాటుచేసుకోవడంతో పాటు.. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ మాదిరి మార్చుకున్నాడు. పక్కా ఆధారాలతో ఆయన బండారాన్ని బట్టబయలు చేయాలనుకున్న కొందరు ఆయన రాసలీలలను వీడియో తీసి మీడియాకు పంపారు. పక్కా ఆధారాలతో వీడియో బయటికొచ్చినా ఫిర్యాదు లేనందున తాము చర్యలు తీసుకోలేమని పోలీసులు చెబుతున్నారు. కనీసం సుమోటోగా కూడా కేసు నమోదుచేయలేమని గాజువాక సీఐ రామారావు స్పష్టం చేశారు.

అత్యాచారం కేసు నమోదుచేయండి
బాధితురాలు మైనర్‌లా ఉందని, ప్రలోభపెట్టి అసభ్యంగా ప్రవర్తించినట్టు స్పష్టమవుతోందని.. కానీ ఫిర్యాదు లేదని పోలీసులు కేసు నమోదుచేయకపోవడం దారుణమని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎక్కడైనా వ్యభిచారం జరిగితే దాడులు చేసి కేసులు నమోదు చేసే పోలీసులు.. టీడీపీ కార్యాలయాన్నే వ్యభిచార కేంద్రంగా మార్చేస్తే పట్టించుకోరా.. అని ప్రశ్నించారు. అది మా పార్టీ కార్యాలయం కాదు.. అని కేసు తారుమారు చేసినా ఆశ్చర్యపోనక్కరలేదని.. ఈ పాలనలో ఏదైనా సాధ్యమేనని ఆమె వ్యాఖ్యానించారు. 24 గంటల్లో కేసు నమోదు చేయకుంటే మహిళా సంఘం తరఫున పోరాటం చేస్తామని లక్ష్మి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement