సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణహత్య | Software Enger Was Murder In Suraram | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణహత్య

Apr 14 2019 10:36 AM | Updated on Apr 14 2019 2:28 PM

Software Enger Was Murder In Suraram - Sakshi

సాక్షి, క్రైమ్‌ : నగరంలో దారుణం చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లావణ్య హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. లావణ్యను హత్య చేసి సూట్‌కేస్‌ బ్యాగులో ప్యాక్‌ చేసి.. సూరారం కాలువలో పడేశారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజులు క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయిన లావణ్య.. ఇలా శవమై తేలడం సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

సునీల్‌ కుమార్‌, లావణ్యలు గతకొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. శారీరకంగా తనను వాడుకున్న సునీల్‌.. పెళ్లికి మాత్రం నిరాకరించాడు. దీంతో  పెళ్లి గురించి లావణ్య పలుమార్లు ఒత్తిడి తీసుకురావడంతో.. ఓ హోటల్‌కు రమ్మని అక్కడ మాట్లాడుకుందామని సునీల్‌ నమ్మబలికాడు. అక్కడికి వెళ్లిన లావణ్యను అతికిరాతంగా చంపి.. బ్యాగ్‌లో వేసి.. కాలువలో పడేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీల్‌ను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement