సియాటెల్‌లో దుండగుడి కాల్పులు, ఇద్దరు మృతి

Seattle:Gunmen Fired, Two Were Dead And Several Injured - Sakshi

వాషింగ్టన్‌:  ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పలువురు తీవ్ర గాయలపాలైన ఘటన బుధవారం వాషింగ్టన్‌లోని సియాటెల్ నగరంలో చోటుచేసుకుంది. ఘాతుకానికి పాల్పడ్డ దుండగుడు ముందుగా ఒక వాహనం దగ్గరికి వెళ్లి అందులోని మహిళపై కాల్పులు జరిపాడు. తర్వాత సమీపంలోని మెట్రో బస్సు మీద దాడికి తెగబడ్డాడు. ఆ కాల్పుల్లో బస్సు డ్రైవర్‌ తీవ్రంగా గాయాల​య్యాయి. ప్రాణాపాయ స్థితిలో కూడా సదరు డ్రైవర్‌ బస్సును ఆగంతకుడికి దూరంగా తీసుకెళ్లి, ప్రయాణికుల్ని రక్షించే ప్రయత్నం చేశాడు. కొద్ది క్షణాలకే ఆ డ్రైవర్‌ మరణించాడు. 

విషయం తెలుసుకున్న పోలీసలు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నం చేయగా..  వారి నుంచి తప్పించుకునే క్రమంలో అతడు కారులో వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో సదరు కారు డ్రైవర్‌ కూడా మరణించాడని.. కొద్దిసేపటి తర్వాత కాల్పులు జరిపి, నిందితుడ్ని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. బస్పు దాడిలో గాయపడ్డ ప్రయాణికులను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. నిందితుడికి కూడా గాయాలవడంతో అతడిని హార్బోర్‌వ్యూ మెడికల్‌ సెంటర్‌లో చేర్పించి పోలీసుల గస్తీలో ఉంచారని తెలుస్తోంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top