బరి తెగించిన ఇసుక అక్రమ వ్యాపారులు

Sand illegal traders over actions - Sakshi

     ట్రాక్టర్లను అడ్డుకున్నవీఆర్వోపై దాడి

     తమ జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరిక

మరికల్‌ (నారాయణపేట): మహబూబ్‌ నగర్‌ జిల్లా మరికల్‌ మండలం పూసల్‌పహాడ్‌ సమీప కోయిల్‌సాగర్‌ వాగు వద్ద ఇసుక అక్రమ వ్యాపారులు బుధవారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న పాపానికి వీఆర్వో మైబన్నపై దాడికి దిగారు. పూసల్‌పహాడ్‌కు చెందిన కొందరు అక్రమ ఇసుక వ్యాపారులు బుధవారం రాత్రి కోయిల్‌సాగర్‌ వాగులో నుంచి ఇసుక తరలిస్తున్నారు.

గుర్తించిన గ్రామ సేవకులు వీఆర్వో మైబన్నకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వచ్చి.. గ్రామ సేవకుల సహాయంతో ట్రాక్టర్లను సీజ్‌ చేసేందుకు ప్రయత్నించగా.. ఆయనపై దాడికి దిగుతూ పక్కకు నెట్టేశారు. వెంటనే ట్రాక్టర్‌లో ఉన్న ఇసుకను అన్‌లోడ్‌ చేస్తూ పరారయ్యారు. ఈ సమయంలో తమ ట్రాక్టర్ల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించినట్లు వీఆర్వో, గ్రామసేవకులు తెలిపారు.

Back to Top