నర్సరావుపేటలో రియాల్టర్‌ దారుణ హత్య

Realtor Ramesh Murder In Narasaraopet  - Sakshi

గుంటూరు : నర‍్సరావుపేటలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. రావిపాడు రోడ్డులోని ఓ వెంచర్‌ సమీపంలో వ్యాపారి తడికమల‍్ల రమేష్‌ మృతదేహం లభ్యమైంది.  స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా రెండు కోట్ల రూపాయల లావాదేవీలే ఈ హత‍్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top