రెండున్నరేళ్లుగా లైంగిక దాడి | They raped me for 2.5 yrs, made videos, now threatening to kill me: woman employee | Sakshi
Sakshi News home page

రెండున్నరేళ్లుగా లైంగిక దాడి

Nov 30 2017 4:45 PM | Updated on Jul 28 2018 8:53 PM

raped me 2.5 yrs make video and thretened:dda employee  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: రెండున్నరేళ్లు లైంగిక దాడికి తెగబడ్డారు..ఘాతుకాన్ని వీడియోలో రికార్డు చేశారు..ఇప్పుడు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు’ ఇదీ ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ(డీడీఏ)లో పనిచేసే బాధిత ఉద్యోగిని ఆవేదన. సీనియర్‌ అధికారి సహా నలుగురు సహోద్యోగులు తనపై పలు సందర్భాల్లో అత్యాచారానికి ఒడిగట్టారని చెబుతున్నారు.

తనపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా వాటిని వీడియో తీసి బెదిరిస్తున్నారని వాపోయారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా తనను హతమారుస్తామని హెచ్చరిస్తున్నారని చెప్పారు. తనకు జరిగిన అన్యాయాన్ని బాధిత ఉద్యోగిని సీనియర్‌ డీడీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

బాధిత మహిళకు 2014లో భర్త మరణించిన క్రమంలో డీడీఏలో ఉద్యోగం లభించింది. కాగా, బాధితురాలి ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని డీసీపీ రొమిల్‌ బనియా చెప్పారు. ఉద్యోగిని ఫిర్యాదుపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించామని సీనియర్‌ డీడీఏ అధికారి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement