మితిమీరుతున్న వ్యభిచార వృత్తి

Police Attack On Sex Workers Houses Nizamabad - Sakshi

కామారెడ్డి క్రైం: మనిషిలోని బలహీనతలను సొమ్ము చేసుకునే దిశగా వ్యభిచార వృత్తి కొత్తరూపం దాల్చుతోంది. కస్టమర్లను ఆకర్షించడం, వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు రాబట్టేందుకు అందమైన యువతులను దూరప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఏకంగా ముంబాయితోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల నుంచి యువతులను తెప్పిస్తున్నట్లు వెల్లడవుతోంది. కామారెడ్డిలో ఈ చీకటి వ్యాపారం చాపకిందనీరులా వ్యాపిస్తోంది. ముంబాయి, విజయవాడ ప్రాంతాల నుంచి యువతులను తెప్పించి వ్యభిచారం నడిపిస్తున్నారు. ముంబాయి నుంచి వేశ్యగా వచ్చిన ఓ యువతికి నిర్వాహకులతో డబ్బుల విషయంలో ఏర్పడిన వివాదం పోలీసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని రిమాండ్‌కు పంపారు. జిల్లా కేంద్రంలో హైటెక్‌ పద్ధతిలో వ్యభిచార గృహాలు నడుస్తున్నాయని చెప్పడానికి ఇదో నిదర్శనం.

విచ్చలవిడిగా నిర్వహణ...  
బస్టాండ్, రైల్వేస్టేషన్లు, రద్దీగా ఇతర ప్రాంతాల్లో వ్యభిచార వృత్తి విచ్చలవిడిగా మారింది. పట్టణంలో ఇటీవల కాలంలో ఇలాంటి వారి సంఖ్య పెరుగుతోంది. రోడ్ల వెంబడి కొన్ని చోట్ల అడ్డాలుగా ఏర్పడి వ్యభిచారం వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. చుట్టు పక్కల ఉండే వ్యాపార సముదాయాలు, చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా ఇలాంటి వ్యవహరంలో తలదూర్చడం ఎందుకులే అనుకుని సర్దుకుపోతున్నారు. కొత్త బస్టాండ్‌ ఎదురుగా రోడ్ల పక్కనే బహిరంగంగా చెట్లకింద బైఠాయించి వ్యభిచారానికి సంబంధించిన వ్యవహారాలు నిర్వహిస్తుండడం ఇటీవలి కాలంలో పెరిగింది. రోడ్ల వెంబడి బేరాలు కుదుర్చుకుని సమీపంలోని లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిన విషయమేనైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. గతంలో రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో ఎక్కువగా వ్యభిచార వ్యవహారాలు జరిగేవి. అక్కడ గొడవలు కావడంతో కొంతకాలంగా అడ్డాలను కొత్తబస్టాండ్‌ ప్రాంతానికి మార్చారు. ఎంతో మంది అమాయకులు ఇలాంటి వారి బారిన పడి అన్ని రకాలుగా నష్టపోతున్నారు.

 పెరుగుతున్న అడ్డాలు... 
కామారెడ్డిలోని అశోక్‌నగర్, స్నేహపురి కాలనీ, ఎన్‌జీఓస్, పంచముఖి హనుమాన్, బతుకమ్మకుంట కాలనీల్లో వ్యభిచార గృహాలు వెలుస్తున్న ట్లు తెలుస్తోంది. స్నేహపురి కాలనీలో 3 నుంచి 4కు పైగా వ్యభిచార గృహాలు ఉన్నాయని కాలనీ వాసులు చెబుతున్నారు. గతంలో ఇక్కడ నిర్వహించే వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. కొంతకాలం తర్వా త ఈ చీకటి వ్యాపారం మళ్లీ ప్రారంభమైంది. తా జాగా ముంబాయి నుంచి ఓ యువతిని తెచ్చి ఖరీ దైన వ్యభిచారం చేయించిన ఘటన స్నేహపురి కా లనీలో చోటు చేసుకుంది. డబ్బుల వ్యవహారంలో వివాదం తలెత్తి కేసు నమోదైంది. బాధితురాలని ఓ ఆశ్రయానికి తరలించిన పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో ఖరీదైన వ్యభిచారం గృహాలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎంతో మంది ఉన్నతస్థానంలో ఉన్నవారు, యువకులను ఆకర్షిస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన అవసరం ఉంది.

లాడ్జీలపై కొరవడిన నిఘా...  
జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్, రైల్వేస్టేషన్‌ ప్రాం తాల్లో ఉన్న కొన్ని లాడ్జీలు వ్యభిచార వృత్తినే ఆధా రంగా చేసుకుని నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్తబస్టాండ్‌ ప్రాంతంలోని కొందరు లాడ్జీల నిర్వాహకులు వ్యభిచార కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో క్రమం తప్పకుండా లాడ్జీలపై దాడులు జరిగేవి. ఇటీవలి కాలంలో లాడ్జీల నిర్వహణపై పోలీసుశాఖ నిఘా కొరవడింది. కనీస చర్యలు కనిపించడం లేదు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఇలాంటి లాడ్జీలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
 

మహిళ రిమాండ్‌
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఓ మహిళను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఎస్‌హెచ్‌ఓ రామక్రిష్ణ శుక్రవారం తెలిపా రు. అనంతపురంనకు చెందిన రాధ కొంతకాలం గా కామారెడ్డిలోని అశోక్‌నగర్‌ కాలనీలో ఇల్లు కొని నివాసం ఉంటుంది. ఆమె ముంబాయి, కో ల్‌కతాల నుంచి అమ్మాయిలను తెప్పించి తన ఇంట్లో ఆశ్రయం ఇస్తుంది. డబ్బులకు ఒప్పందం చేసుకుని వచ్చిన అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తుంది. ఒప్పందం చేసుకుని డబ్బులు ఇవ్వనందుకు పీర్యా అనే ముంబాయికి చెందిన యువతి రాధతో గొడవపడి పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేసిందని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. కేసు న మోదు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను రిమాండ్‌కు తరలించామన్నారు. వ్యభిచారంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 

చర్యలు తీసుకుంటాం...  
పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తున్నారని ఫిర్యాదు అందడంతో విచారణ జరిపి కేసు నమోదు చేశాం. ఇకపై ఎవరైనా అమ్మాయిలను రప్పించి వ్యభిచారం చేయిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.  –రామకృష్ణ, ఎస్‌హెచ్‌ఓ, కామారెడ్డి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top