ఆర్టీసీ బస్సులో తుపాకీ కలకలం  | Person Carrying FireArm Weapon In Rtc Bus Was Arrested In Adilabad | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో తుపాకీ కలకలం 

Oct 17 2019 8:27 AM | Updated on Oct 17 2019 8:27 AM

Person Carrying FireArm Weapon In Rtc Bus Was Arrested In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : ఆర్టీసీ బస్సులో బుధవారం తుపాకీ కలకలం రేపింది.. ఆదిలాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌కు బయల్దేరిన బస్సులో ఓ ప్రయాణికుడి దగ్గర తుపాకీ లభ్యమైంది. నిర్మల్‌ జిల్లా పోన్కల్‌ గ్రామానికి చెందిన టాటాఏసీ వ్యాన్‌ డ్రైవర్‌ షేక్‌ హైదర్‌ తుపాకీ వెంట తీసుకుని ఆర్టీసీ బస్సులో నాగ్‌పూర్‌కు బయల్దేరాడు. మహారాష్ట్రలోని వర్ద జిల్లా వన్నెర చెక్‌పోస్టు వద్ద ఉదయం 11.30 గంటల సమయంలో మహారాష్ట్ర పోలీసులు తనిఖీలు చేపట్టగా అతనివద్ద ఒక కంట్రిమేడ్‌ తపంచ, తొమ్మిది బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర పోలీసులు అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement