సుమలత ఆది నుంచి కన్నింగే! 

New Twist In Sumalatha Case In Ongole - Sakshi

సాక్షి, ఒంగోలు : మైనర్‌పై లైంగిక దాడికి  పాల్పడిందన్న ఫిర్యాదుతో సుమలతను కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులకు రోజుకో ట్విస్టు ఎదురవుతోంది. ఆమె లైంగిక దాడికి వినియోగించిన కృత్రిమ పరికరాన్ని, పురుషుడిలా ఆమె ధరించిన దుస్తులు, విగ్‌ను పోలీసులు సీజ్‌ చేసిన సంగతి విదితమే. ఈ కేసులో మగ వాడిలా మైనర్‌ను పరిచయం చేసుకుంటూ వినియోగించిన సాయి కిరణ్‌ పేరును కూడా ఆమె వ్యూహాత్మకంగా వాడుకున్నట్లు గుర్తించారు. తొలుత సాయి కిరణ్‌ అనే వ్యక్తే లేడని భావించిన పోలీసులు.. ఆ తర్వాత ఆ వ్యక్తి ఉన్నట్లు తెలుసుకున్నారు.  కాగా, అతను ఎనిమిది నెలల క్రితమే సుమలత ఇంట్లో డబ్బులు తీసుకుని పరారైనట్లు ప్రాథమికంగా గుర్తించడం కొసమెరుపు.

వంశీకృష్ణ పాత్రపై ప్రత్యేక దర్యాప్తు
బాధితురాలిని విచారించిన పోలీసులకు ఆమె చెప్పిన కథనం మరోలా ఉంది. తనకు సాయికిరణ్‌ కూల్‌డ్రింక్‌ ఇవ్వడంతో రెండు గంటలకు పైగా సృహ లేదని, ఈ క్రమంలో తనపై సుమలత లైంగిక దాడికి  పాల్పడిందని పేర్కొంది. తాజాగా ఆమె పనిచేసిన ప్రాంతాల్లో విచారిస్తే సుమలత స్వగ్రామంలో తొలుత మగరాయుడిలా సంచరిస్తూ ఆడపిల్లలను బైకులపై తిప్పుతుండేదని తెలిపింది. ఈ నేపథ్యంలో పలుమార్లు  గొడవలు జరగడంతో  మనస్తాపం చెందిన సుమలత అదృశ్యం అయ్యారు.ఈ వ్వయహారంపై ఇప్పటికే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

అయితే రెండు రోజుల తర్వాత ఆమె తిరిగి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కొండపిలో ఆర్‌ఎంపీగా వైద్య సేవలు అందిస్తున్న ఏడుకొండలుతో పాటు అక్కడే సెల్‌ఫోన్‌ షాపు నిర్వహిస్తున్న వంశీకృష్ణతోనూ సుమలతకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఏడుకొండలుతో వివాహం జరిగింది. అయితే క్లినిక్‌కు సమీపంలోనే ఉన్న వంశీకృష్ణతో సైతం ఆమె ఎంతగానో పరిచయం పెంచుకున్నారు. సుమలత వినియోగింన నాలుగు సిమ్‌కార్డులు వంశీకృష్ణ పేరు మీదే రిజిస్టరై ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించుకున్నారు.

ఒకరి సిమ్‌ కార్డును మరొకరు వినియోగిస్తే ఏదైనా నేరం జరిగితే అతను నేరస్తుడుగా మారతాడనేది సికార్డులు విక్రయించే వారికే కాదు, సెల్‌ఫోన్‌ వినియోగించేవారికి తెలిసిన సంగతి విదితమే. మరి అటువంటప్పుడు వంశీకృష్ణ ఏం ఆశించి సుమలతకు తన పేరు మీద సిమ్‌ కార్డులు అందించాడనేది మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ గత చరిత్రను తిరగదోడే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కోణంలోనే వంశీకృష్ణ పలుమార్లు స్థానిక మారుతీనగర్‌లోని సుమ లత నివాసానికి కూడా వచ్చి వెళ్తుండేవాడని గుర్తించారు. వంశీకృష్ణకు సంబంధించి వినిపిస్తున్న ప్రచారంలో సైతం నిగ్గు తేల్చుకునేందుకు పోలీసులు దృష్టి సారించారు.

ఎవరీ సాయికిరణ్‌?
కిలేడీ సుమలత వ్యవహారం ఆది నుంచీ కన్నింగ్‌ నేచర్‌గా పోలీసులు భావిస్తున్నారు. ఒంగోలుకు వచ్చిన సుమలత దుర్గా హోటల్‌లో పనిచేసేది. ఆమెతో పాటు సాయికిరణ్, రమణయ్య అనే వ్యక్తులు కూడా పనిచేసే వారు. సాయికిరణ్‌ కేరాఫ్‌ ఫుట్‌పాత్‌ అని తెలిసింది. ఈ క్రమంలో అతను సుమలతతో పాటు ఆమె ఇంట్లోనే ఉండేవాడు. 8 నెలలక్రితం అతను సుమలత నివాసంలో కొంత డబ్బు తీసుకుని పరారయ్యాడు. ఈ విషయాన్ని అతనితో పాటు పనిచేసిన రమణయ్య స్ఫష్టం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆమె వంశీకృష్ణ సిమ్‌ కార్డులు పొందిన మాదిరిగానే పరారైన సాయికిరణ్‌ పాత్రను కూడా సృష్టించి మగ వేషంలో అకృత్యాలకు పాల్పడుతుండేదని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇదే నిజమైతే బాలికను ట్రాప్‌ చేసిన కొండపిలో రెండు నెలల క్రితమే వారు చేరినట్లు పోలీసులు తెలిపారు. మరి దుర్గా హోటల్‌లో 8 నెలల క్రితం నుంచే పనిచేసేటప్పుడు ఆమె ఒంగోలులో ఎక్కడ నివాసం ఉందనేది మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో సుమలత నివాసంలో ఎనిమిది నెలల క్రితం సాయికిరణ్‌ ఉన్న దృష్ట్యా అతన్ని కూడా విచారిస్తే అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 
(చదవండి : షీ మ్యాన్‌ ! ఆమే.. అతడు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top