ప్రియురాలి భర్తపై హత్యాయత్నం

Murder Attempt On Lover Husband In Thenali Guntur - Sakshi

గుంటూరు, తెనాలిరూరల్‌: వివాహేతర సంబంధానికి ప్రియురాలు ఒప్పుకోకపోవడానికి ఆమె భర్తే కారణమని భావించిన ప్రియుడు అతడిపై హత్యాయత్నం చేశాడు. కత్తితో దాడి చేయగా, తీవ్ర గాయాలతో భర్త చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణ రజకచెరువు ప్రాంతానికి చెందిన దామిశెట్టి రమేష్‌ వెండి బంగారు వర్తక సంఘంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్యకు గంగానమ్మపేటకు చెందిన ఆటో డ్రైవర్‌ శ్రీనుతో సుమారు ఐదున్నరేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ప్రవర్తనను మార్చుకోవాలని భర్త సూచించడంతో కొంతకాలంగా ఆమె శ్రీనుకు దూరంగా ఉంది. రమేష్‌ కారణంగా తన ప్రియురాలు దూరంగా ఉంటోందని, అతడి అడ్డు తొలగించాలని భావించిన నిందితుడు శ్రీను శనివారం రాత్రి ఇంటికి వెళుతున్న రమేష్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని స్థానికులు ప్రకాశం రోడ్డులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. బాధితుడు రమేష్‌  ఫిర్యాదును టూ టౌన్‌ ఎస్‌ఐ పి. సురేష్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top