
ప్రతీకాత్మక చిత్రం
దేశ రాజధానిలో దారుణం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌లో 50 సంవత్సరాల మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి జరిగింది. లజ్‌పత్ నగర్‌లోని పార్కులో అపస్మారకస్ధితిలో పడి ఉన్న బాధితురాలిని గుర్తించిన పోలీసులు ఆమెను సప్ధర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తామని పోలీసులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఓ వ్యక్తి ఆ ప్రాంతంలో పరిగెత్తినట్టు గుర్తించామని, అయితే అతడి ముఖం స్పష్టంగా లేదని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఆ ప్రాంతంలో అనుమానితులను ప్రశ్నించామని డీసీపీ చిన్మయ్ బిస్వాల్ చెప్పారు. కాగా గతంలో ఓ రెస్టారెంట్‌లో పనిచేసిన సుధీర్ అనే వ్యక్తి మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్టు విచారణలో అంగీకరించాడని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించిన వ్యక్తితో సుధీర్ పోలిఉన్నాడని, మహిళ ఒంటరిగా ఉన్నట్టు గుర్తించి దారుణానికి తెగబడినట్టు నిందితుడు చెప్పాడని వెల్లడించారు.