
సాక్షి, కరీంగనగర్ : ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని గుండ్లపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబంలో కలహాలు ఆమె ఊపిరి తీశాయి. ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఉరివేసుకుని తనువు చాలించింది. దీంతో ఆమె బంధువులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న వారిని అడిగి సమాచారం సేకరించారు. ఆమె భర్త, అత్తమామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.