థియేటర్‌లో బాలికపై లైంగికదాడి | Man molestation On Girl In Movie Theatre In Hyderabad | Sakshi
Sakshi News home page

థియేటర్‌లో బాలికపై లైంగికదాడి

May 2 2018 9:41 AM | Updated on Sep 4 2018 5:44 PM

Man molestation On Girl In Movie Theatre In Hyderabad - Sakshi

సనత్‌నగర్‌: థియేటర్‌ ఆవరణ లోని నల్లా వద్దకు నీటి కోసం వచ్చిన బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన సంఘటన సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోరబండ హరినగర్‌కు చెందిన ప్రశాంత్‌ (25) స్థానిక విజేత థియేటర్‌లో స్వీపర్‌గా పనిచేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన బాలిక (13) తరచూ మంచినీటి కోసం  థియేటర్‌ ప్రాంగణంలోని నల్లా వద్దకు వస్తుండేది. ఆమెపై కన్నేసిన ప్రశాంత్‌ అదను కోసం వేచి చూస్తున్నాడు.

మంగళవారం ఉదయం బాలిక వదినతో కలిసి నీటి కోసం అక్కడికి వచ్చింది. ఆమె వదిన నీళ్లు తీసుకుని వెళ్లగా ఒంటరిగా ఉన్న బాలికను ప్రశాంత్‌ బాత్‌రూమ్‌లోకి లాక్కెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడి భారి నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు ప్రశాంత్‌ను పోక్సొ చట్టం ప్రకారం శిక్షించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement