స్కూటీ నడుపుతుండగా బీపీ వచ్చి.. | Man Killed In Road Accident In Orissa | Sakshi
Sakshi News home page

రక్తపోటే ప్రాణాన్ని తీసింది

May 24 2019 5:36 PM | Updated on May 24 2019 5:36 PM

Man Killed In Road Accident In Orissa - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ : అధిక రక్తపోటు ఓ వృద్ధునికి శాపంగా మారింది. తన స్కూటీపై వివాహానికి వెళ్తుండగా ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన కొత్తపల్లి జాతీయ రహదారి సమీపంలో గురువారం చోటు చేసుకుంది. భామిని మండలం బాలేశ్వరం గ్రామానికి చెందిన తులసి పుష్కరరావు(68) సోంపేట మండలం పలాసపురం గ్రామంలోని ఓ యువకుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పుష్కరరావు అర్చక వృత్తి చేస్తూ జీవిస్తున్నాడు. పలాసపురంలో తన కుమార్తె మరిది వివాహ నిమిత్తం బాలేశ్వరం నుంచి స్కూటీపై వస్తుస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తపల్లి జాతీయ రహదారి సమీపంలో రాగానే ఎండ తీవ్రతకు తోడు బీపీ పెరగడంతో వాహనంపై పట్టు కోల్పోయాడు. దీంతో ఫుట్‌పాత్‌ను ఢీకొన్న అనంతరం వాహనంతోపాటు కొంతదూరం ఈడ్చుకుపోగా, ఖానా ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈయన కుమారుడు హేమశంకరరావు ఫిర్యాదు మేరకు మందస హెడ్‌కానిస్టేబుల్‌ కర్రి వైకుంఠరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బారువ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement