పగబట్టి.. ప్రాణం తీశాడు

Man Killed Cousin Having Affair With His Wife In East Godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. తన భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడన్న కక్షతో సోదరుడు వరుసైన వ్యక్తిని దారికాచి విచక్షణారహితంగా కత్తితో నరికి చంపాడు. ఆ తరువాత హత్యాయుధంతో సహా ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన మండలంలోని పంగిడిగూడెం పంచాయతీ మెట్టపంగిడిగూడెంలో మంగళవారం ఉదయం సంచలనాన్ని రేకెత్తించింది. సమాచారాన్ని అందుకున్న భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు, ఎస్సై ఎం.సూర్యభగవాన్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని రక్తనమూనాలను సేకరించి దర్యాప్తును ప్రారంభించారు. స్థానికుల కథనం ప్రకారం. గ్రామానికి చెందిన కొప్పిశెట్టి వెంకట సుబ్బారావు (38) వ్యవసాయం చేసుకుంటూ భార్య, ఇద్దరు కుమారులను పోషిస్తున్నాడు. సుబ్బారావు పెదనాన్న కుమారుడు కొప్పిశెట్టి లక్ష్మణరావు బతుకుతెరువు కోసం ఏడేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. ఇదిలా ఉంటే లక్ష్మణరావు దుబాయ్‌లో ఉన్న సమయంలో అతని భార్య రమాదేవి మరిది వరసైన సుబ్బారావుతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. భర్త దుబాయ్‌ నుంచి వచ్చినా వీరి సంబంధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రమాదేవి భర్త వద్దకు రాకుండా అదే గ్రామంలోని తన తల్లి ఇంట్లో ఉంటోంది. అయితే ఆమె పిల్లలకు తల్లి ప్రవర్తన నచ్చక తండ్రి లక్ష్మ ణరావు వద్ద ఉంటున్నట్లు బంధువులు చెబుతున్నారు. 

పక్కా పథకంతో.. 
లక్ష్మణరావు తన భార్యను కాపురానికి రమ్మని పలుమార్లు బతిమలాడినా ఫలితం లేకపోయింది. ఒకే వీధిలో ఉంటూ సుబ్బారావుతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. దీంతో విసుగుచెందిన లక్ష్మణరావు తన సోదరుడు సుబ్బారావును కడతేర్చేందుకు పథకం పన్నాడు. ఈ క్రమంలో సుబ్బారావు గేదెల పాలు తీసేందుకు మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో తన పొలానికి వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ కత్తితో కాపుకాసుకుని ఉన్న లక్ష్మణరావు మోటారు సైకిల్‌పై పొలానికి వచ్చిన సుబ్బారావును ఇష్టానుసారంగా తెగ నరికాడు. ముందు రెండు చేతులను నరకడంతో సుబ్బారావు కొంతదూరం పరుగులు తీశా డు. అయితే లక్ష్మణరావు అతడిని వెంబ డించి మరీ రెండు కాళ్లను సైతం నరకడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిపోయాడు. దీంతో సుబ్బారావు మృతిచెందినట్లు భావించిన లక్ష్మణరావు, హత్యకు ఉపయోగించిన కత్తితో సహా పోలీస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కొన ఊపిరితో కొ ట్టుమిట్టాడుతున్న సుబ్బారావును స్థానిక రైతులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై భీమడోలు సీఐ సు బ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top