దారుణం: రూ.5 చిల్లర అడిగాడని.. | Man Killed For Asking Change For 5 Rupees In Mumbai | Sakshi
Sakshi News home page

దారుణం: రూ.5 చిల్లర అడిగాడని..

Feb 26 2020 3:40 PM | Updated on Feb 26 2020 3:53 PM

Man Killed For Asking Change For 5 Rupees In Mumbai - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దారుణం: రూ.5 చిల్లర అడిగాడని..

ముంబై : తనకు రావాల్సిన చిల్లర అడిగినందుకు ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మంగళవారం నాడు ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై బోరివాలికి చెందిన రామ్‌దులర్‌ సింగ్‌ యాదవ్‌(68) అనే వ్యక్తి మంగళవారం  గ్యాసు నింపించుకోవటానికి దగ్గరలోని మగథానే గ్యాస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. గ్యాస్‌ నింపించుకుని, డబ్బులు చెల్లించిన తర్వాత తనకు రావాల్సిన 5 రూపాయల చిల్లర అడిగాడు. దీంతో అక్కడ పనిచేసే కొందరు రామ్‌ను చుట్టుముట్టి తిట్టడం ప్రారంభించారు. అనంతరం దారుణంగా చితకబాది అక్కడినుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ అతడు కొద్దిసేపటికే మరణించాడు. బుధవారం రామ్‌ కుమారుడు సంతోష్‌ యాదవ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు కారణమైన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement