పాతబస్తీలో విషాదం! | man committed suicide in hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో విషాదం!

Oct 12 2017 10:14 AM | Updated on Nov 6 2018 8:41 PM

man committed suicide in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. వడ్డీవ్యాపారుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెడకు ఉరితాడు బిగించుకుని సెల్ఫీ వీడియోలో మరణ వాగ్మూలం రికార్డు చేసి.. ప్రాణాలు తీసుకున్నాడు.

పాతబస్తీ జుమ్మేరాత్‌ బజార్‌లో మహ్మద్‌ షాహిద్‌ హుస్సేన్‌ అనే యువకుడు కుర్చీల షాపు నిర్వహిస్తున్నాడు. వ్యాపారం నిమిత్తం ఐదుగురు వ్యక్తుల నుంచి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. కొన్ని నెలలు వడ్డీ చెల్లించిన హుస్సేన్‌... ఆర్థిక పరిస్థితి బాగోలేక మూడు నెలలుగా కట్టలేకపోయాడు. దీంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైందని సమాచారం. వారు తనను చంపేందుకు కూడా కుట్ర చేస్తున్నారని హుస్సేన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా ఎవరూ చేసుకోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియోను ఇక్కడ పోస్టు చేస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement