అప్పు చెల్లించలేదని వేలిని కత్తిరించాడు | man Attack On village person thousand Rupees Loan | Sakshi
Sakshi News home page

అప్పు చెల్లించలేదని వేలిని కత్తిరించాడు

Dec 12 2017 8:30 AM | Updated on Oct 2 2018 4:26 PM

man Attack On village person thousand Rupees Loan - Sakshi

తుమకూరు: వెయ్యి రూపాయల అప్పు చెల్లించట్లేదనే కోపంతో ఓ వ్యక్తి యువకుడి వేలును కత్తిరించిన ఘటన సోమవారం తుమకూరు తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని నిడుహోళు గ్రామానికి చెందిన శివణ్ణ 15 రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన కుమార్‌ అనే వ్యక్తి వద్ద రూ.1000 అప్పు తీసుకున్నాడు.

చెప్పిన తేదీ ప్రకారం బాకీ చెల్లించాలంటూ ఆదివారం శివణ్ణను హెచ్చరించాడు. సకాలంలో డబ్బు అందక  శివణ్ణ బాకీ చెల్లించలేకపోయాడు.దీంతో ఆగ్రహం చెందిన కుమార్‌ సోమవారం కత్తితో శివణ్ణపై దాడి చేశాడు. ఘటనలో శివణ్ణ మధ్య వేలు పూర్తిగా తెగిపోయింది. గమనించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.హెబ్బూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement