వివాహమై పదేళ్లవుతున్నా.. | Madurai Couple Suicide in Odisha | Sakshi
Sakshi News home page

మదురై దంపతులు ఒడిశాలో ఆత్మహత్య

Aug 19 2019 6:36 AM | Updated on Aug 19 2019 4:03 PM

Madurai Couple Suicide in Odisha - Sakshi

భార్య మాలవితో రాజు జయపాల్‌

వివాహమై పదేళ్లవుతున్నా సంతానం లేనందున

తమిళనాడు ,టీ.నగర్‌: ఒడిశాలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాజు జయపాల్‌ దంపతులు సంతానం కలగలేదన్న విరక్తితో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆరు పేజీల సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ వివరాలు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. ఒడిషా రూర్కెలాలోగల నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా రాజు జయపాల్‌ (37) పనిచేస్తూ వచ్చాడు. ఈయన సొంతగ్రామం మదురై. ఇతడి భార్య మాలవి (35).

గత రెండు రోజులుగా రాజు జయపాల్‌ కళాశాలకు రాలేదు. శుక్రవారం కొందరు విద్యార్థులు అతని ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. లోపల గడియ పెట్టి ఉన్నందున దిగ్భ్రాంతి చెందిన వారు పోలీసుల సాయంతో తలుపులు పగులగొట్టారు. అక్కడ దంపతులు ఇరువురూ బెడ్‌పై మృతిచెందివున్నారు. అక్కడ సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తమకు వివాహమై పదేళ్లవుతున్నా సంతానం లేనందున విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. దీనిగురించి రూర్కెలా ఎస్పీ సర్దాక్‌ సారంగి మాట్లాడుతూ దంపతులు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపామని తెలిపారు. ఈ మృతి గురించి మదురైలోని వారి బంధువులకు సమాచారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement