ఉద్యోగం ఒక చోట.. జీతం మరోచోట

Line Inspectors Gambling in Wages Kurnool Electricity Department - Sakshi

ఇద్దరు లైన్‌ ఇన్‌స్పెక్టర్ల డిప్యుటేషన్‌లో మాయాజాలం  

ఆదోని: విద్యుత్‌ సంస్థ డివిజన్‌ కార్యాలయంలో జరిగిన ఓ డిప్యుటేషన్‌ అంశం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పని ఒత్తిడి లేని చోట నుంచి పని ఒత్తిడి ఉన్న ప్రాంతానికి ఉన్నత స్థాయి అధికారులు.. సిబ్బందిని సర్దుబాటు(సర్దుబాటు) చేస్తుంటారు. అయితే ఆదోని విదుŠయ్‌త్‌ సంస్థలో మాత్రం విచిత్రం చోటుచేసుకుంది. డి–2 సె„ýక్షన్‌లో పని చేస్తున్న లైన్‌ఇన్‌స్పెక్టర్‌ను ఎమ్మిగనూరుకు డిప్యుటేషన్‌పై  పంపిన అధికారులు ఆయన స్థానంలో పత్తికొండ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ను డిప్యుటేషన్‌ వేశారు. దీంతో పత్తికొండ మండలం లైన్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టు ఖాళీ అయింది. ఎమ్మిగనూరులో పని భారం ఉందనుకుంటే పత్తికొండ లైన్‌ఇన్సెక్టర్‌ను నేరుగా అక్కడికి పంపొచ్చు.

కానీ ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు.. పత్తికొండ నుంచి ఆదోనికి.. ఎవరి కోసం ఇలా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు లైన్‌ ఇన్‌స్పెక్టర్లు 2018 నుంచి జీతాలు ఒక చోట తీసుకోని మరోచోట సేవలు అందిస్తున్నా రు. నిబంధనల మేరకు ఆరు నెలల దాటితే డిప్యుటేషన్‌ను ఉన్నతాధికారుల అనుమతితో పొడిగించాలి. ఈ ఇద్దరు ఉద్యోగులు నాలుగేళ్లుగా ఎలా కొనసాగుతున్నారోనని, వా రికి సహకరిస్తున్నదెవరోననే విమర్శలు వ్యక్తమవుతున్నా యి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన డిప్యుటేషన్ల వెనుక ఏం జరిగిందో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీఎన్‌టీయూసీ డివిజన్‌ కార్యదర్శి జయన్న డిమాండ్‌ చేశారు. ఈ విషయమై డిప్యూటీ ఈఈ పురుషోత్తంను వివరణ కోరగా.. తాను ఇటీవలే బాధ్యతలు స్వీకరించానని, గతంలో ఏమి జరిగిందో తెలియదని చెప్పారు. విచారించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top