చిన్న పిల్లల కిడ్నాప్‌ ముఠా అరెస్ట్‌ | kidnap gang arrest | Sakshi
Sakshi News home page

చిన్న పిల్లల కిడ్నాప్‌ ముఠా అరెస్ట్‌

Feb 16 2018 11:46 AM | Updated on Aug 20 2018 4:27 PM

kidnap gang arrest - Sakshi

పట్టుబడిన కిడ్నాప్‌ ముఠా

అనంతపురం సెంట్రల్‌: చిన్న పిల్లల కిడ్నాప్‌కు పాల్పడే ముఠాను త్రీటౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వివరాలను సీఐ మురళీకృష్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు. నగరంలోని ఇందిరానగర్‌లో  జగన్నాథ్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతనికి ప్రగతి, పూజిత అనే కుమార్తెలు ఉన్నారు. గత నెల 18న ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారులతో కొంతమంది మాటలు కలిపారు. చాక్లెట్‌లు ఇస్తుండగా గమనించిన తల్లిదండ్రులు వారిని వారించారు. నిందితులు, తల్లిదండ్రుల మధ్య గొడవ జరిగింది.

అనంతరం అనుమానం వచ్చిన జగన్నాథ్‌ జరిగిన విషయాన్ని త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తాజాగా బుధవారం వారు మరోసారి ఇంటి వద్ద రెక్కి నిర్వహించారు. నిందితులను పసిగట్టిన జగన్నాథ్‌ పోలీసులకు తెలిపాడు. గురువారం రైల్వేస్టేషన్‌ సమీపంలోని శివాలయం దగ్గర ముఠా ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో డోన్‌కు చెందిన ఎరికల రవి, నల్లచెరువు మండలానికి చెందిన వడ్డె రామాంజనేయులు, డోన్‌కు చెందిన అర్జున్‌ ఉన్నారు. వీరితో పాటు భారతి, సరోజ అనే మహిళలు కూడా ముఠాలో ఉన్నట్లు గుర్తించారు. మహిళా నేరస్తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement