బాలికను వేధిస్తూ... సెల్‌ ఫోన్‌లో ఫొటోలు! | Girl Molested By 60 Years Man In Vikarabad | Sakshi
Sakshi News home page

బాలికపై వృద్దుడి వేధింపులు

Mar 5 2020 10:38 AM | Updated on Mar 5 2020 10:38 AM

Girl Molested By 60 Years Man In Vikarabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కుల్కచర్ల: ఓ వృద్ధుడు సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. వరుసకు మనవరాలయ్యే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు సమాచారం. వివరాలు.. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం అల్లాపూర్‌ తండాకు చెందిన బాలిక(12) మండల పరిధిలోని ముజాహిద్‌పూర్‌ మోడల్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. నిత్యం ఆమె తండా నుంచి పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండేది. ఈక్రమంలో దారిలో ఉన్న ఓ కోళ్లఫారంలో బాలికకు వరుసకు తాత అయ్యే వృద్ధుడు(60) పని చేస్తున్నాడు.

బాలిక పాఠశాలకు వచ్చిపోయే సమయంలో తరచూ ఆమెను ఫారంలోకి పిలిపించుకొని లైంగిక వేధింపులకు గురిచేస్తూ సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీస్తున్నాడు. రెండురోజుల క్రితం బాలిక వృద్ధుడి వద్ద సెల్‌ఫోన్‌ తీసుకుని మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌కి వాట్సప్‌లో వృద్ధుడు తీసిన ఫొటోలు పంపించింది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్‌ బాలికల తల్లిదండ్రులను పిలిపించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండుకు తరలించినట్లు సమాచారం. ఈవిషయమై పోలీసులు ఎలాంటి వివరాలు ఇవ్వడం లేదు. బాలికను వైద్య పరీక్షల అనంతరం వికారాబాద్‌లోని సఖి కేంద్రానికి తరలించినట్లు సమాచారం. కేసు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement