
ప్రతీకాత్మక చిత్రం
ముంబై: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది ఓ మైనర్ బాలిక. అతనితో కలిసి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో అనుకోకుండా తల్లి రావడంతో బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ముంబైలోని కుర్లా ప్రాంతానికి చెందిన 17 సంవత్సరాల బాలిక.. కుటుంబ సభ్యులందరూ బయటకు వెళ్లడంతో తన బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి బెడ్ రూమ్‌లో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె తల్లి అకస్మాత్తుగా లోపలికి వచ్చింది. చదవండి: కర్ణాటకలో ఆపరేషన్ ఆకర్ష్ షురూ..!
ఈ క్రమంలో తన తల్లికి ఏమి చెప్పాలో అర్థం కానీ పరిస్థితుల్లో బెడ్ రూమ్ కిటికీలోనుంచి కిందకి దూకేసింది. దీంతో షాక్ తిన్న ఆ యువకుడు అక్కడ నుంచి తప్పించుకొని వెళ్లిపోయాడు. తీవ్రగాయాలపాలైన ఆ బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు ఆ యువకుడిని సునీల్ జెండేగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్న కారణంగా అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: అవి తిన్నందువల్లే మారుతీరావు మృతి..!