
ముంబై : తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఓ యువతి కఠిన నిర్ణయం తీసుకుంది. ఆవేదనతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ముంబైలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఆరతి తాప్సీ(18) కుటుంబంతో కలిసి చెంబురులోని మహుల్ మహడ కాలనీలో నివాసం ఉంటోంది. స్థానికంగా ఓ బ్యూటీ పార్లర్‌లో పని చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో రోజులాగే సోమవారం కూడా పార్లర్‌కు వెళ్లిన తాప్సీ... ఆ రోజు ఆలస్యంగా ఇంటికి వచ్చింది. దీంతో తండ్రి ఆమెను మందలించాడు.
ఈ క్రమంలో భవనం ఆరో అంతస్తుపైకి వెళ్లిన తాప్సీ అక్కడి నుంచి కిందకు దూకింది. ఇదంతా సీసీ కెమెరాలో చూసిన ఓ వ్యక్తి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. కాగా తీవ్ర గాయాలతో సృహ కొల్పోయిన తాప్సీని కుటుంబ సభ్యులు హూటహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.