ఐదుగురు బీజేపీ కార్యకర్తల దుర్మరణం

Five BJP Workers Dead In Car Accident At Himachal Pradesh - Sakshi

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల కారు మండి జిల్లాలోని ఓ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా రాష్ట్ర ముఖ్యమంత్రి జై రామ్‌ ఠాగూర్‌ నిర్వహిస్తున్న ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు సమాచారం. మార్గ మధ్యలో కారులో లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయాలపాలైన డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top