నటుడి సోదరుడిపై కేసు! | FIR Against Nawazuddin Siddiqui Brother For Facebook Posting | Sakshi
Sakshi News home page

Jun 11 2018 8:58 AM | Updated on Oct 5 2018 9:09 PM

FIR Against Nawazuddin Siddiqui Brother For Facebook Posting - Sakshi

మీరట్‌ : హిందువులు ఆరాధించే పరమశివుడి ఫొటోను కించపరిచే రీతిలో ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధికీ సోదరుడు అయాజుద్దిన్‌ సిద్ధిఖీపై కేసు నమోదైంది. అయాజుద్దీన్‌ పోస్టుపై హిందూ యువవాహిని (హెచ్‌వైవీ) కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేయడంతో మీరట్‌లోని బుధానా పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఐపీసీ సెక్షన్‌ 153ఏ (మతం, జాతి, ప్రాంతం ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం) కింద ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదుచేశారు.

శివుడి ఫొటోను అభ్యంతరకర రీతిలో పోస్టు చేసిన అయాజుద్దీన్‌ వెంటనే అరెస్టు చేయాలని హెచ్‌వైవీ నేత భరత్‌ ఠాకూర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, నిజానికి శివుడి పట్ల అభ్యంతరకర పోస్టును ఖండిస్తూ.. అయాజుద్దీన్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారని, అయితే, శివుడి అభ్యంతరకర ఫొటోను ఆయన కాపీ చేసి.. తన పోస్టులో పెట్టడంతో హెచ్‌వైవీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ముజఫర్‌నగర్‌ డీఎస్పీ హరిరామ్‌ యాదవ్‌ తెలిపారు. ఆయన పోస్టు ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని, ఫేస్‌బుక్‌లో ఇలాంటి అభ్యంతకరమైన ఫొటోలు షేర్‌ చేయకూడదని, అలాంటి వాటిని తాను తిరస్కరిస్తున్నానని ఆయన తన పోస్టులో పేర్కొన్నారని డీఎస్పీ చెప్పారు. ‘శివుడిపై ఓ వ్యక్తి అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. దానిపై నేను అతడితో పోట్లాడాను. మత మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి పోస్టులు పెట్టకూడదని కోరుతూ నేను పోస్టు పెట్టాను. కానీ నాపైనే కేసు నమోదు చేశారు’ అని అయాజుద్దీన్‌ సిద్ధిఖీ మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement