ఫేక్‌ న్యూస్‌ ఎఫెక్ట్‌; మరొకరు బలి

 Due To Fake News 1 Dead And 3 Injured in Ahmedabad - Sakshi

అహ్మదాబాద్‌ : ఈ మధ్య సోషల్‌ మీడియాలో మరీ ముఖ్యంగా వాట్సాప్‌లో పిల్లలన్ని ఎత్తుకెళ్లేవారంటూ, మనుషుల్ని తినే వారంటూ రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పాపం వీటి వల్ల అమాయకులు బలవుతున్నారు. కాస్తా అనుమానస్పదంగా ఎవరు కనిపించిన వారి గురించి పూర్తి వివారాలు తెలుసుకోకుండానే వారిని చితకబాదుతున్నారు జనాలు. తాజగా ఇలాంటి ఫేక్‌ న్యూసే ఓ మహిళ మృతికి కారణమయ్యింది.

వివరాల ప్రకారం...సర్దార్‌ నగర్‌కు చెందిన శాంతా దేవితో పాటు మరో ముగ్గురు అశుదేవి నాథ్‌, లైలాదేవి నాథ్‌, అన్సి నాథ్‌లు కలిసి ఆటోలో అహ్మదాబాద్‌లోని వదాజ్‌ ప్రాంతానికి వెళ్తున్నారు. ఇంతలో కొందరు గ్రామస్తులు వీరిని పిల్లల్ని ఎత్తుకెళ్లే వారిగా అనుమానించి వారి మీద దాడి చేశారు. వారించడానికి వెళ్లిన ట్రాఫిక్‌ పోలీస్‌ను కూడా అడ్డుకోవడంతో అతడు పోలీసులకు సమాచారమందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, దెబ్బలు తిని గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించారు.

అయితే శాంతాదేవి ఆస్పత్రికి చేరేలోపే మార్గమధ్యలోనే మరణించింది. ఈ దాడికి పాల్పడిని 30 మంది గుర్తు తెలియని వ్యక్తుల మీద పోలీసులు కేసు నమోదరు చేశామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top