డాక్టర్‌నే మోసం చేసిన ఘనుడు | Doctor Shared OTP And Cheated Unknown Person In Guntur | Sakshi
Sakshi News home page

డాక్టర్‌నే మోసం చేసిన ఘనుడు

Published Tue, Jun 19 2018 11:22 AM | Last Updated on Tue, Jun 19 2018 11:22 AM

Doctor Shared OTP And Cheated Unknown Person In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: సైబర్‌ నేరగాడి చేతిలో డాక్టర్‌ మోసపోయారు. ఓటీపీ షేర్‌ చేయడంతో ఆమె బ్యాంక్‌ ఖాతాలోని రూ. 19,500 మాయమయ్యాయి. జరిగిన మోసంపై ఆమె అర్బన్‌ ఎస్పీని సోమవారం ఆశ్రయించారు. గుంటూరు మెడికల్‌ కళాశాలకు చెందిన అసిస్టెంట్‌ మహిళా ప్రొఫెసర్‌కు వారం రోజుల క్రితం రాత్రి సమయంలో గుర్తు తెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. బ్యాంక్‌ అధికారులం మాట్లాడుతున్నాం... మీ క్రెడిట్, డెబిట్‌ కార్డు గడువు ముగుస్తోందని.. కార్డులు బ్లాక్‌ అవుతాయని మాయమాటలు చెప్పారు. మీ నంబర్‌కు వచ్చిన ఓటీపీ నెంబర్‌ షేర్‌ చేస్తే ఆన్‌లైన్‌లో కార్డులు రీ జనరేట్‌ చేస్తామని తెలిపారు. వారి మాటలు నమ్మిన ఆమె ఓటీపీ షేర్‌ చేశారు. కొద్దిసేపటి తర్వాత బ్యాంకు ఖాతా నుంచి రూ.19,500 ట్రాన్స్‌ఫర్‌ అయినట్టు డాక్టర్‌కు మెసేజ్‌ వచ్చింది. అది చూసి ఆమె కంగు తిని వెంటనే ఆ నంబర్‌కు ఫోన్‌ చేయగా అందుబాటులో లేదు అని వచ్చింది. మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement