తల్లిదండ్రుల గొడవలో కుమార్తె మృతి

Daughter Died In Parents Stir - Sakshi

గోరంట్ల: తగువులాడుతున్న తల్లిదండ్రులను విడిపించబోయిన కుమార్తె.. ఆవేశంలో తండ్రి తోసేయడంతో కిందపడి మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు.. గుంటిపల్లి తండాకు చెందిన వృద్ధులు రాంజీనాయక్, సాలీబాయి దంపతులు.

వితంతువైన కుమార్తె చిట్టిబాయి (40)కూడా వీరివద్దే ఉంటోంది. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో తల్లిదండ్రులు గొడవ పడుతుండటంతో చిట్టిబాయి విడిపించేందుకు వెళ్లింది. ఈ క్రమంలో తండ్రి బలంగా తోసేయడంతో చిట్టిబాయి కిందపడింది. బలమైన గాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు చిట్టిబాయికి ఒక కుమార్తె ఉంది. పుట్టపర్తి రూరల్‌ సీఐ రవికుమార్, ఎస్‌.ఐ సుధాకర్‌యాదవ్‌ సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చిట్టిబాయి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top