డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ : న్యూ ఇయర్‌ రోజు పట్టుబడినవారికి శిక్ష ఖరారు

Court Sentenced 405 People Jail Drunk And Drive - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : న్యూ ఇయర్‌ రోజు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుపడినవారికి లోకల్‌ కోర్టు జైలు శిక్ష విధించింది. గత ఏడాది డిసెంబర్‌ 31న రాత్రి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పట్టుబడిన వారిని ఈనెల 3 నుంచి 25 వరకు జైలులో ఉంచాలని కోర్టు తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు.. భారీ మొత్తంలో జరిమానాను విధించింది. సైబరాబాద్‌ లిమిట్స్‌లో పట్టుబడిన వారిలో 405 మందికి జైలు శిక్షతో పాటు రూ.2వేలు జరిమానాను విధిస్తూ తీర్పును వెలువరించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా పట్టుబడిన వారికి రూ. 500, మద్యం సేవించిన వారికి వెహికిల్‌ ఇచ్చినందుకు రూ.5000, మైనర్‌ డ్రైవర్స్‌కి రూ.1000 చొప్పున జరినామా విధించింది. మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో 147, గచ్చిబౌలి-72, మియాపూర్‌-56, కూకట్‌పల్లి-79, బాలానగర్‌-51 మందికి జైలు శిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పును వెలువరించింది. శిక్షపడిన వారిలో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top