కానిస్టేబుల్ ఆత్మహత్య

సాక్షి, కామారెడ్డి జిల్లా: మండల కేంద్రం తడ్వాయిలో కానిస్టేబుల్ హాజీ అహ్మద్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సైబరాబాద్ జగద్గిరిగుట్టలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న హాజీ.. కరోనా నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ మొదలయినప్పుడు ఆయన తన భార్య పిల్లలను అత్తారింటికి పంపించారు. భార్యకు తెలియకుండా కామారెడ్డి వచ్చిన హాజీ.. తాడ్వాయిలో విషం తాగి రోడ్డు పక్కన విగత జీవిగా కనిపించాడు.
వ్యక్తిగత ఇబ్బందులు కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని తమను హైదరాబాద్లోని ఇంటికి రానియలేదని, సేఫ్టీ కోసం అమ్మగారి ఇంట్లోనే ఉంటున్నామని ఆయన భార్య చెబుతోంది. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి