ఓటీపీ చెబితే.. ఖాతాలు ఖాళీ

Bank OTP Details Dont Share anybody - Sakshi

క్షణాల్లో నగదు మాయం

జిల్లాలో జన్‌ధన్‌ ఖాతాలకు

ఇష్టానుసారంగా మొబైల్‌.. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యాక్టివేట్‌

ఓటీపీలతో డబ్బులు తీసేస్తున్న నేరగాళ్లు

డీజీపీ ఆదేశాలతో అప్రమత్తమైన పోలీసుశాఖ

ఇప్పుడు నగదు లావాదేవీలు సులభంగా మారాయి. బ్యాంకులో అడుగు పెట్టకుండా ఖాతాలోని డబ్బుల్ని వివిధ రకాలు వాడుకునే వెసులుబాటు కలిగింది. ఆన్‌లైన్‌లో వస్తువులను కొనడం, మన ఖాతా నుంచి మరో ఖాతాలోకి డబ్బులు పంపడం, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లింపులు చేయడం సులువైంది. దీనికి అంతటికీ కారణం ఓటీపీ (వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌). దీన్ని ఆసరాగా తీసుకున్న నేరగాళ్లు చాలా మంది ఖాతాల నుంచి రూ.లక్షల్లో డబ్బులు మాయం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులను డీజీపీ ఆదేశించారు.

చిత్తూరు అర్బన్‌: కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి వ్యక్తికీ బ్యాంకు ఖాతా తప్పనిసరంటూ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకుల్లో ఎలాంటి నగదు నిల్వ చేయాల్సిన అవసరం లేదని, జీరో బ్యాలెన్స్‌లో బ్యాంకు ఖాతాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జ న్‌ధన్‌ పేరిట జిల్లాలో 5.70 లక్షల ఖాతాలు ప్రారంభించారు. ఆ ఖాతాలు ప్రారంభించిన వారిలో మ హిళా సంఘాల్లోని సభ్యులు, కూలి పనిచేసేవాళ్లు, పెద్దగా చదువుకోనివాళ్లు ఉన్నారు. 80 శాతం ఖాతా దారులకు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాం కింగ్‌పై ఏ మాత్రం అవగాహన లేదు. ఖాతాదారుల ప్రమేయం లేకుండా సాధారణ ఖాతాలతో పాటు జన్‌ధన్‌ ఖాతాలున్న 60 శాతం మంది వినియోగదారులకు మొబైల్‌ బ్యాంకింగ్, ఇంటర్నెట్‌ బ్యాం కింగ్‌ వ్యవస్థను కొన్ని బ్యాంకులు యాక్టివేట్‌ చేసే శాయి. తమ బ్యాంకు ఖాతాలకు ఈ సదుపాయాలున్నాయని, వీటితో ఏమి చేయొచ్చో ఖాతాదారులకు ఏమాత్రం తెలియదు.

ఇలా మోసం...
ఇంటర్నెట్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్‌ను ఉపయోగించేటప్పుడు ప్రతి ఒక్క లావాదేవీకి బ్యాం కు ఖాతాదారుడి మొబైల్‌ నెంబరుకు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. ఫ్లిప్‌ కార్ట్, ఈ–బే, అమేజాన్‌ వంటి ఈ–కామర్స్‌ సంస్థల నుంచి నేరగాళ్లు కొనుగోళ్లు జరుపుతారు. ఇందుకోసం ఢిల్లీ, ముంబయి, జార్ఖండ్‌ లాంటి ప్రాంతాల నుంచి ఖాతాదారులకు ఫోన్‌ చేసి తాము బ్యాంకు ప్రధా న శాఖ నుంచి మాట్లాడుతున్నామని, మీ ఏటీఎం కార్డు నెంబరు, సీవీవీ నెంబరు చెప్పమంటారు. ఇవి చెప్పిన తరువాత మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుం దని, దాన్ని కూడా చెప్పమంటారు. ఇలా మనం చెబుతున్న ప్రతిసారీ మన ఖాతా నుంచి ఎంత మొత్తం డబ్బులు అయిపోతున్నాయో సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు వ స్తుంటాయి. వీటిని ఏ మాత్రం చూడకుండా ఓటీపీలు చెప్పాలని మాయమాటలతో బ్యాంకు ఖాతాలోని డబ్బంతా కాజేస్తున్నారు.

ఏం చేయాలి...
ఏ ఒక్క బ్యాంకు అధికారి కూడా ఖాతాదారుడికి ఫోన్‌ చేసి బ్యాంకు వివరాలు, ఏటీఎం కార్డు, ఓటీ పీ నెంబరు అడగరనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మొబైల్‌ బ్యాంకింగ్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ అవసరం లేకున్నా యాక్టివ్‌లో ఉన్నట్లయితే వెంటనే బ్యాంకుకు వెళ్లి వాటిని డీ–యాక్టివ్‌ చేసుకోవాలి. ఇక ఎవరైనా ఆన్‌లైన్‌ మోసానికి గురైతే వెంటనే సమీపంలోని పోలీసులకు ఫిర్యా దు చేయడం వల్ల నేరగాళ్లు కొనుగోలు చేసిన వస్తువులు డెలివరీ కాకుండా ఆపడానికి సాధ్యమవుతుంది.

బ్యాంకర్లతో మాట్లాడాం..
ఆన్‌లైన్‌ మోసాలపై ఇప్పటికే జిల్లాలోని ప్రధాన బ్యాంకు అధికారులతో మాట్లాడాము. ఖాతాదారుడి రిక్వెస్ట్‌ లేకుండా యాక్ట్‌వ్‌ చేసిన మొబైల్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ను డీ–యాక్టివ్‌ చేయమన్నాం. ప్రజలు కూడా లావాదేవీలు చేసేటప్పుడు వచ్చే మెసేజ్‌లను ఎప్పటికప్పుడు చూసుకోవాలి. మీ వ్యక్తిగత బ్యాంకు, ఏటీఎం వివరాలను ఏ ఒక్కరికీ చెప్పకండి.. పంచుకోకండి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top