ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

Auto Driver Ends Life After Being Freed On Bail In Guntur District - Sakshi

పాంచాళవరంలో యువకుడి ఆత్మహత్య

సాక్షి, గుంటూరు: చెట్టుకు ఉరి వేసుకుని వివాహితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అమృతలూరు మండలం పాంచాళవరం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గోనుగుంట్ల లక్ష్మీనారాయణ(35), అదే గ్రామానికి చెందిన దివ్య పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. లక్ష్మీనారాయణ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు.

దివ్య ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో వారు జిల్లా పోలీసులను ఆశ్రయించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు,  కుమార్తె ఉన్నారు. కొద్దికాలంగా భార్య దివ్యను పలు మార్లు హింసించడంతోపాటు ఇటీవల లక్ష్మీనారాయణ హత్యాయత్నం చేయడంతో గ్రామస్తులు రక్షించారు. ఈమేరకు భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, తెనాలి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్‌ విధించింది. కేసు కోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో బెయిల్‌పై వచ్చిన లక్ష్మీనారాయణ సోమవారం రాత్రి భార్యతో గొడవ పడినట్టు స్థానికులు తెలిపారు. మంగళవారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని ఉండగా, గుర్తించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని, మృతుని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ విషయంపై అమృతలూరు ఎస్‌ఐ జి. పాపారావు వివరణ కోరగా విషయం తన దృష్టికి రాలేదన్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top