ఒక్కో వాహనంపై 27 చలాన్లు

27 Challans on Each Bike in Himayathnagar Hyderabad - Sakshi

రెండు బైక్‌ల పట్టివేత

హిమాయత్‌నగర్‌: నగరంలో రోడ్లపై హెల్మెట్‌ లేకుండా తిరుగుతున్నారు. నో పార్కింగ్‌ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్, ర్యాష్‌డ్రైవింగ్‌తో తోటి వాహనదారులను భయభ్రంతాలకు గురి చేస్తున్నారు. పలు దఫాలుగా సిగ్నల్స్‌ పాయింట్స్‌ వద్ద రికార్డైన సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా చలాన్లు ఇంటికి పంపినా స్పందించ లేదు.  మంగళవారం తనిఖీలు నిర్వహిస్తున్న నారాయణగూడ ట్రాఫిక్‌ ఎస్‌ఐ కృష్ణంరాజు హెల్మెట్‌ లేకుండా వెళ్తున్న రెండు బైక్‌లను ఆపి తనిఖీ చేయగా ఒక్కో వాహనంపై 27 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. బొజ్జు హనుమంతు ‘ఏపీ–11ఏఎన్‌.5220’ వాహనంపై 27 చలాన్లు, రూ.6140, సంజయ్‌కుమార్‌ 11ఏ.ఎన్‌.8104, 27 చలాన్లు, రూ.3010 బకాయిలు ఉన్నాయి. హనుమంతు బకాయిలను చెల్లించడంతో వాహనాన్ని వదిలివేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top