ఎగ్జిబిషన్‌లో అపశ్రుతి.. 15మందికి గాయాలు

15 People Injured In Air Balloon Fell Down Incident In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ఎగ్జిబిషన్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎయిర్‌బెలూన్‌ కుప్పకూలి దాదాపు 15మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎగ్జిబిషన్‌లో ఎయిర్‌ బెలూన్‌లోడ్ ఎక్కువ అయి.. గాలి లీక్‌ కావటంతో అదికాస్తా కుప్పకూలింది. ఈ సంఘటనలో 15మంది గాయపడగా బయటఉన్న ఓ బాలుడు సైతం తీవ్రంగా గాయపడ్డాడు.

దీంతో అతన్ని అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఎగ్జిబిషన్‌ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులకు, బాధితులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎగ్జిబిషన్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top