దైవసన్నిధానం చైర్మన్‌గా మోహన్‌బాబు బాధ్యతల స్వీకరణ

Mohanbabu took charge as Sannidhanam chairman - Sakshi

సాక్షి, ఫిల్మ్‌నగర్‌: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం చైర్మన్‌గా నటుడు మోహన్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మరో నటుడు మురళీమోహన్‌ మాట్లాడుతూ  దైవసన్నిధానం 18 దేవుళ్ల సముదాయం అని చెప్పారు. ఈ దైవసన్నిధానానికి ఆద్యుడు వి.బి. రాజేంద్రప్రసాద్ అని, అప్పటి మూలధనంతో సన్నిధానాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సన్నిధానానికి రూ.3 కోట్ల 70 లక్షల విరాళాలు వచ్చాయని వివరించారు. ఈ దైవభక్తిలో పాలుపంచుకుంటానని మోహన్‌బాబు కోరారన్నారు. నూతన పాలకవర్గాన్ని ఎన్నుకుంటామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ చిరంజీవి, తాను చిలుకా గోరింకల్లా గొడవపడుతుంటామన్నారు.

ఇప్పటికి రెండు కమిటీలు సన్నిధానాన్ని దిగ్విజయంగా నిర్వహించాయని విశాఖ శారదా పీఠాధిపతి  స్వరూపానందేంద్రస్వామి అన్నారు. మోహన్‌బాబు చైర్మన్‌గా రావడం ఆనందంగా ఉందని, ఆయనకు కొత్త జీవితం ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, స్వరూపానందేంద్రస్వామి, ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి, చాముండేశ్వరీనాథ్ తదితరులు హాజరయ్యారు.

Read latest Tollywood News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top