సెకండ్‌ దివాలీ : టాటా మోటార్స్‌ బంపర్‌ ఆఫర్‌ | Tatamotors bumber offer : second diwali | Sakshi
Sakshi News home page

సెకండ్‌ దివాలీ : టాటా మోటార్స్‌ బంపర్‌ ఆఫర్‌

Nov 9 2019 7:17 PM | Updated on Nov 9 2019 7:19 PM

Tatamotors bumber offer : second diwali - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ వాహన తయారీదారు టాటా మోటార్స్‌ తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా మోటార్స్‌ ఎస్‌యూవీని, లేదా పిక్‌ అప్‌ ట్రక్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు అద్భుతమైన బహుమతిని గెలచుకునే అవకాశాన్ని కల్పించింది.  తద్వారా  ప్రజలకు మరో దీపావళి వెలుగులునింపనున్నామని టాటా మోటార్స్‌  తెలిపింది. టాటామోటర్స్‌  ఎస్‌యూవీ ని లేదా పిక్‌ అప్‌ ట్రక్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు  (టీవీ, వాషింగ్‌ మెషీన్‌,  మిక్సీ తదితర)  ఒక గిఫ్ట్‌ను అందివ్వనుంది. అంతేకాదు దీంతో  పాటు సుమారు  రూ. 5లక్షల విలువైన బంగారాన్ని ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది. ఈ ఆఫర్‌ నవంబరు 1నుంచి 30వ తేదీవరకు అందుబాటులో ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement