టాటా సన్స్‌ ప్రైవేటీకరణకు ఇన్వెస్టర్ల ఆమోదం

టాటా సన్స్‌ ప్రైవేటీకరణకు ఇన్వెస్టర్ల ఆమోదం


సాక్షి, ముంబై: టాటా గ్రూపు సంస్థల ప్రమోటర్ టాటాసన్స్..పబ్లిక్ లిమిటెడ్ కంపెనీనుంచి ప్రైవేట్ లిమిటెడ్  కంపెనీగా అవతరించేందుకు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.  గురువారం జరిగిన ఏజీఎంలో  ఇన్వెస్టర్లు  ఆమోదం తెలిపారు.

టాటా సన్స్ వాటాదారుల సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) లో  ఈ మేరకు ఆమోదం లభించిందని తెలిపింది. అన్ని తీర్మానాలకు  మెజారీటీ వాటాదారులు ఆమోదం తెలిపారని టాటా సన్స్‌ ఒక ప్రకటనలో  వెల్లడించింది. దీనికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం  లభిస్తే టాటా సన్స్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ  ముగిసినట్టే.మరోవైపు టాటా సన్స్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకిస్తూ టాటాసన్స్‌ మాజీ  ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ పెట్టుకున్న పిటీషన్‌ను  ఎన్‌సీఎల్‌ఏటీ  తిరస్కరించింది. అయితే  మిస్త్రీ సంస్థలకు కనీస వాటాదారుల ప్రమాణాల నుంచి మినహాయింపు ఇచ్చింది. ముంబై ఉన్‌సీఎల్‌ఏటీలో  దరఖాస్తు చేసుకునేందుకు  అనుమతినిచ్చింది. దీన్ని  మిస్త్రీ  స్వాగతించారు. కార్పొరేట్  గవర్నెన్స్‌ గరిష్ట ప్రమాణాలను కొనసాగించాలని,  టాటా  గ్రూపులో పారదర్శకత కాపాడాలని డిమాండ్‌ చేశారు.


కాగా గత  ఏడాది అక్టోబరు 24న అనూహ్యంగా   టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీని పదవిని తొలగించింది. అలాగే  ఫిబ్రవరి 6, 2017 న హోల్డింగ్ కంపెనీ బోర్డు డైరెక్టర్గా కూడా తొలగించిన సంగతి తెలిసిందే.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top