ఆఫర్లన్నీ ఒకేచోట! | stores N Offers .com new startup company special story | Sakshi
Sakshi News home page

ఆఫర్లన్నీ ఒకేచోట!

Dec 10 2016 1:48 AM | Updated on Sep 2 2018 4:03 PM

ఆఫర్లన్నీ ఒకేచోట! - Sakshi

ఆఫర్లన్నీ ఒకేచోట!

షాపింగ్ అంటే ఎవరికై నా ఇష్టమే. ఆఫర్లుంటే ఉత్సాహం పెరుగుతుంది. మరి ఎక్కడెక్కడ ఏ ఆఫర్లున్నాయో తెలుసుకోవటమెలా?

స్టోర్స్‌ఎన్‌ఆఫర్స్.కామ్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షాపింగ్ అంటే ఎవరికై నా ఇష్టమే. ఆఫర్లుంటే ఉత్సాహం పెరుగుతుంది. మరి ఎక్కడెక్కడ ఏ ఆఫర్లున్నాయో తెలుసుకోవటమెలా? ‘స్టోర్స్‌ఎన్‌ఆఫర్స్.కామ్’ చూస్తే చాలు. ఇది హైదరాబాద్‌లో ఏ షాపుల్లో ఆఫర్లు, బంపర్ సేల్స్ ఉన్నాయో మన ముందుంచుతుంది. దీనిపై మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ జే రవితేజ మాటల్లోనే...

అన్ని సంస్థలూ పత్రికలు, టీవీలు, హోర్డింగ్‌‌సలలో ప్రకటనలివ్వలేవు. ఇచ్చినా అవి కస్టమర్లకు చేరుతాయని గ్యారంటీ లేదు. ఈ గ్యాప్‌ను నింపటమే స్టోర్స్‌ఎన్‌ఆఫర్స్.కామ్ పని. అంటే దుకాణాదారులు, కొనుగోలుదారులను కలుపుతుందన్న మాట. స్థానికంగా ఏ దుకాణాల్లో ఎలాంటి ఆఫర్లున్నాయో చెబుతూ కస్టమర్ల డబ్బును ఆదా చేస్తుంది.

జె.పూజ, పవన్ కుమార్ మారెంతో కలిసి రూ.10 లక్షలతో 2016 జూన్‌లో ఆరంభించాం.

విక్రయదారులు తమ ఉత్పత్తులను, మా సైట్ ద్వారా ఉచితంగా ప్రచారం చేసుకోవచ్చు. ఆఫర్లుంటే వాటిని ప్రత్యేకంగా ప్రదర్శించుకోవచ్చు. కస్టమర్ తనకు కావాల్సిన విభాగాన్ని నమోదు చేయగానే దాని తాలుకు ఆఫర్లు ఏ ఏ దుకాణాలు అందిస్తున్నాయో చిరునామా, ఫోన్ నంబర్లతో సహా అందిస్తాం. ఇక నేరుగా కస్టమరే షాపుకు వెళ్లి కొనుక్కోవచ్చు. ప్రతి ఉత్పత్తి కొనుగోలుపై స్టోర్ నుంచి 10-15% కమీషన్ రూపంలో తీసుకుంటాం.

దుస్తులు, ఫర్నిచర్, ఫుడ్, రెస్టారెంట్స్, స్పా, సెలూన్, ఫిట్‌నెస్, గ్రాసరీ, ఎలక్ట్రానిక్స్ వంటి 9 విభాగాల్లో 1,000కి పైగా ఆఫర్లున్నారుు. 2 వేల స్టోర్లు నమోదయ్యారుు. జనవరిలో ఆండ్రారుుడ్, ఫిబ్రవరిలో ఐఓఎస్ యాప్స్‌ను  తెస్తాం.

5 వేల మంది కస్టమర్లున్నారు. నెలకు లక్ష పేజీ వ్యూలొస్తున్నారుు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే సేవలందిస్తున్నాం. 2017లో నిధుల సమీకరణ పూర్తి చేసి బెంగళూరు, ముంబైలకు విస్తరిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement